![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -402 లో.. మురారి గదిలోకి వచ్చిన విషయం కూడా కృష్ణ మర్చిపోయి మరీ ఆలోచిస్తుంటే.. మురారి దిండుతో కొడతాడు. అసలేంటి సర్ అంత కోపమా అని కృష్ణ అంటుంది. ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నావు.. ఒక్క నా గురించి తప్ప. ఇన్ని రోజులు ఆగింది ఇద్దరికి ఒకేసారి శోభనం జరగాలనే కదా.. ఇప్పుడు వాళ్లకి జరిపిస్తే మన పరిస్థితి ఏంటని మురారి కోప్పడతాడు. సరే మీకిప్పుడు శోభనం కావాలి కదా సరే ఏర్పాట్లు చేపిస్తాను కానీ మనకు పుట్టబోయే బిడ్డలు దొంగలు, రౌడీలు అవుతారు.. మంచి పిల్లలు పుట్టరు మీకు ఇష్టమేనా అని కృష్ణ అంటుంది.
ఆ తర్వాత మురారి ఇప్పుడే వద్దులే అని కృష్ణతో చెప్తాడు. మరొకవైపు శోభనం ఎలా ఆపాలని ముకుంద ఆలోచిస్తుంటుంది. మొన్న అంటే ఏదో ఒకటి చేసి ఆపాను.. ఇలా ప్రతిసారీ ఎలా ఆపాలి. ఇదంతా టెన్షన్ ఎందుకు? డైరెక్ట్ అత్తయ్యకి చేసి మాట్లాడతానని భవానికి ముకుంద ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ కలవదు. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు ముకుంద దగ్గరికి వస్తారు. శోభనానికి షాపింగ్ చెయ్యాలి కదా వెళదామని కృష్ణ అనగానే.. ఇప్పుడు ఎందుకు కాలినొప్పిగా ఉందని ముకుంద అంటుంది. అసలు దెబ్బ తాకలేదు నువ్వు నటిస్తున్నావ్.. నీకు ఈ శోభనం ఇష్టం లేదు.. ఆ విషయం తెలుసుకోవడానికే నా ప్లాన్ అని కృష్ణ అనుకుంటుంది. ముకుందని బలవంతం పెట్టకండి మీరు వెళ్లి తీసుకొని రండి అని ఆదర్శ్ అనగానే.. సరే అని కృష్ణ, మురారి ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్తారు. ఆ తర్వాత రేవతి దగ్గరికి మధు వచ్చి.. ముకుంద ఫోటో చూపించి శోభనం అన్నప్పుడు ముకుంద మొహం ఎలా పెట్టిందో చూడు ఇష్టం లేనట్లని మధు అంటాడు. అలా అయి ఉండదని రేవతి అంటుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు. నాకు తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకోని రమ్మని కృష్ణకి మురారి చెప్తాడు. కానీ ముకుంద దగ్గరకి కృష్ణ వెళ్లి బట్టలు ఇస్తుంది. అప్పుడే ముకుంద ఫోన్ కి కాల్ వస్తుంది. ఫోన్ లో నా మొగుడు అని రావడంతో కృష్ణ ఎవరని షాక్ అవుతుంది. ఆదర్శ్ ఇంట్లోనే ఉన్నాడు కదా ఎందుకు ఇక్కడ ఫోన్ అని వెళ్తుంది. కాసేపు ఉంటే దొరికిపోయేదాన్ని అని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ బయటకు వెళ్తుంటే ఆదర్శ్ ఫోన్ మాట్లాడతాడు. ముకుంద, ఆదర్శ్ మాట్లాడుకుంటున్నారని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మురారి దగ్గరికి కృష్ణ వెళ్తుంది. నువ్వు కాఫీ తెమ్మంటే మర్చిపోతావని ముకుందకి కాల్ చేసానని మురారి అనగానే.. అంటే ఇందాక చేసింది మీరేనా అని కృష్ణ షాక్ అవుతుంది. మీరు ఫ్రెషప్ అయి రండి అని మురారిని కృష్ణ పంపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కనిపెడతా అని మురారి ఫోన్ ని కృష్ణ తీసుకుంటుంది. తరువాయి భాగంలో.. నీపై నాకు ప్రేమ ఇంకా ఉంది. నేను మారలేదు. నువ్వు ఎలాగైనా ఆదర్శ్ ని ఇక్కడ నుండి పంపించేయ్.. శోభనం ఆపేయని మురారిని ముకుంద బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |